• Login / Register
  • AgniVeer Recruitments | డిసెంబ‌ర్ 8 నుంచి అగ్నివీర్ల నియామ‌కం

    AgniVeer Recruitments | డిసెంబ‌ర్ 8 నుంచి అగ్నివీర్ల నియామ‌కం
    డిసెంబ‌ర్ 8 నుంచి 16 వ‌ర‌కు నియామ‌క ర్యాలీలు
    మోస‌పూరిత ట్వీట్లు, వదంతులు న‌మ్మ‌వ‌ద్దు..

    Hyderabad : తెలంగాణ రాష్ట్రంలో అగ్నివీరుల రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు ఈ నెల 8 నుంచి 16 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అందుకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్‌ స్టేడియంలో ఈ ర్యాలీలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ నియామ‌కాల‌లో భాగంగా అగ్నివీర్‌ జనరల్‌ డ్యూటీ, అగ్నివీర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ క్లర్క్ పోస్టుల‌తో పాటు స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, అగ్నివీర్‌ ట్రేడ్స్‌మెన్‌ కేటగిరీల్లో భర్తీలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు  ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి (కరైకల్‌-యానాం ) మహిళా మిలటరీ పోలీస్‌ (WMP) అభ్యర్థులు.. 2024 ఫిబ్రవరి 12 నాటి ర్యాలీ నోటిఫికేషన్‌ ప్రకారం అవసరమైన డాక్యుమెంట్ల అన్నింటిని తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. 
    ఈ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, ద‌ళారుల‌కు అవ‌కాశం లేద‌ని అధికారులు తెలిపారు. నియామక ర్యాలీలో ఉత్తీర్ణత సాధించడానికి తాము హెల్ప్‌ చేస్తామంటూ.. ఎవరైనా న‌మ్మ‌ప‌లికితే వారి మాట‌ల‌ను నమ్మవద్దని అధికారులు సూచించారు. మోసపూరిత ట్వీట్లు, మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే.. రిక్రూట్‌మెంట్‌ కార్యాలయానికి చెందిన ఫోన్‌ నంబర్లు 040-27740059, 27740205 సంప్రదించాలని సూచించారు.
    *  *  *

    Leave A Comment